kadapa jc

ధాన్యం కొనుగోలు ఫిర్యాదులపై హెల్ప్‌ లైన్‌

వార్తలు
242 Views

మద్దతు ధర కంటే తక్కువగా ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రైతులకు రాకూడదని జేసీ ఎం.గౌతమి అన్నారు.వరి ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాల్లో రైతు వివరాల నమోదు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల పొలాల్లోనే ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర పొందేందుకు వారి యొక్క పంట దిగుబడులకు ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలను రైతులకు వివరించాలన్నారు. మధ్యవర్తులు, దళారులతో నష్టపోకుండా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఏవైనా సమస్యలుంటే 8 8 8 6 3 3 3 2 10 నెంబరుకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పిర్యాదు చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టికలను పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *