Sunday, December 3, 2023

పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ముందా

బద్వేలులో నిర్వహించిన తెదేపా రైతుపోరు లో తెదేపా నాయకులు ముఖ్యమంత్రిని, వైసీపీ నాయకులను విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. మైదుకూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశారని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో విత్తనాల కోసం రోజుల తరబడి ఉండి తెచ్చుకునే పరిస్థితి నుంచి నేడు ప్రతి గ్రామంలోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. ఈక్రాప్‌ నమోదు చేసిన పంటలకు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని, జిల్లాకు రూ. 286 కోట్ల రూపాయల బీమా మంజూరైందన్నారు. చంద్రబాబు చేసిన రూ.1200 కోట్ల అప్పు పెట్టడం వలల్ డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని , వైకాపా ప్రభుత్వంలో అప్పు చెల్లించి వచ్చే నెల నుంచి డ్రిప్ పరికరాలు అందించబోతున్నట్లు వెల్లడించారు. అనేక రకాల వ్యవసాయ పనిముట్లకు రాయితీ అందిస్తోదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేసి సంక్షేమం కోసం పాటు పడుతోందన్నారు. రైతులు ఉద్యమించాలని చెబుతున్నతెదేపా ఎందుకు ఉద్యమించాలో చెప్పాలన్నారు. దేవుడు దయతో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండి రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, మంచిని రాయడం లేదని ప్రశ్నించారు. చేసే విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి, లోటుపాట్లు సరిదిద్ధుకునేలా ఉండాలన్నారు. ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిగట్టుకుని ఎల్లో పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సరిదిద్ధుకునేలా ఉండాలన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలందరూ జగన్ మోహన్‌రెడ్డి వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీలకు ప్రణాళిక, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. ముఖ్యమంత్రిని ఎదుర్కొనే ధైర్యం ఏఒక్క రాజకీయ పార్టీకి లేదన్నారు. ప్రతిపక్షాల నాయకుల మాటలతీరు అసహ్యించుకునేలా ఉందని మండిపడ్డారు. 2014, 2019లోనూ ఒంటరిగా పోటీ చేశామని, 2024లోనూ ఏపార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తామన్నారు. ఏరాజకీయ పార్టీకైనా దమ్ముందా అంటూ ప్రశ్నించారు. దుల్హన్ అనేది ఒక మైనార్టీ కి మాత్రమే లేదు బాబు దాన్ని చంద్రన్న పెళ్లి కానుక మార్పు చేశారు. దుల్హన్ కు 50,000 కాకుండా 1లక్ష రూపాయలు ఇస్తానన్నది వాస్తవమే అయితే కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular