Tuesday, March 19, 2024

హార్టికల్చర్ హబ్‌గా  కృషి

[et_pb_section admin_label=”section”]
[et_pb_row admin_label=”row”]
[et_pb_column type=”4_4″]
[et_pb_text admin_label=”Text”]
కడప జిల్లాను హార్టికల్చర్ హబ్ గా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు.
ప్రభుత్వ పథకాలను, రాయితీలను సద్వినియోగం చేసుకుని జిల్లా రైతులు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. గురువారం ఏపీఎమ్ఐపి పీడీ  మధుసూదన్ రెడ్డి,  జిల్లా ఉద్యాన శాఖాధికారి వై వి ఎస్ ప్రసాద్ లతో కలసి పులివెందుల క్లస్టర్ పరిధిలోని పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లె, వెంపల్లె మండలాలలో మైక్రో ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ అమలు, ఉద్యాన పంటల సాగు అంశాలపై కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలంలోని  పెండ్లిమర్రి, రంపతాడు గ్రామాల్లో డ్రిప్ ఏర్పాటు, రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంట  పంటలు, పంటల సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కారానికి  తీసుకోవాల్సిన చర్యలను కలెక్టరు తెలుసుకున్నారు.  ఈసందర్భంగా రైతులతోనూ చర్చించారు.  వీరపునాయిని పల్లె లో ప్రసాద రెడ్డి అనే రైతు రూ.14లక్షల పెట్టుబడి, రూ.14 లక్షల ప్రభుత్వ రాయితీతో మొత్తం రూ.28లక్షలు ఖర్చుతో ఒక ఎకరాలో షేడ్ నెట్ కింద  పండిస్తున్న కీర దోస సాగును కలెక్టర్ పరిశీలించారు. పంట కాలపరిమితి, సాగు విధానం, రైతు పెట్టుబడి, ఖర్చులు, పంట దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం తదితర వివరాలను కలెక్టర్ రైతును, అధికారులను అడిగి తెలుసుకున్నారు.హార్టికల్చర్ హబ్‌ వీరపునాయినిపల్లె మండలంలో సాగునీరు తక్కువ ఉందని, గండికోట నుండి ఒక టీఎంసీ నీరు వదలాలని రైతులు కలెక్టర్ ను కోరారు. అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పాలగిరి, పాశ్యంపల్లె, కీర్తి పల్లె లో రహదారి నిర్మాణంతో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం లేదని పేర్కొనగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.  వేంపల్లి మండలంలో 2015 -16లో ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్ కింద సాయి సంగమేశ్వర సొసైటి వారు ఏర్పాటు చేసుకున్న  అరటి కోల్డ్ స్టోరేజ్ ను కలెక్టర్ పరిశీలించారు. యూనిట్ కాస్ట్ రూ.24.38 లక్షలు కాగా ఇందులో 35 శాతం రాయితీ రూ.8.53 లక్షలు చెల్లించినట్లు అధికారులు వివరించారు. అరటి ప్యాక్ హౌస్ ను పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు చేసి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, పథకాలను వందశాతం సద్వినియోగం చేసుకునేలా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  కార్యక్రమంలో హార్టికల్చర్ ఏడీ వెంకటేశ్వర రెడ్డి, ఉద్యాన అధికారులు జయభారత్‌రెడ్డి, లక్షుమయ్య,  రాఘవేంద్రరెడ్డి తదతరులు పాల్గొన్నారు.
[/et_pb_text]
[/et_pb_column]
[/et_pb_row]
[/et_pb_section]

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular