అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కడపలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరు హరికిరణ్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రతిరోజూ యోగసనాలు వేయాలనే ఆవశ్యకతను చాటి చెప్పారు. మైదుకూరులో ఆదిత్య యోగా మండలి నిర్వహించిన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పాల్గొన్నారు.