ysrkadapa

వార్తలు

అంతర్ రాష్ట్ర దొంగలు..  చైన్ స్నాచర్ గ్యాంగ్ అరెస్ట్

జిల్లాలో పులివెందుల అర్బన్, రూరల్, కడప వన్ టౌన్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. వీరి నుంచి రూ. 17లక్షల విలువ చేసే 314గ్రాములు బంగారు నగలు, 80 గ్రాముల వెండి, రూ.45వేల నగదు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పులివెందుల్లోని నాలుగు ఇళ్లలో దొంగతనాలు, మూడు చైన్ స్నాచింగ్ లతోపాటు అనంతపురంలో 7 చైన్ స్నాచింగ్ కేసుల్లో కర్ణాటక రాష్ట్రం రాయచూరు, బాగల్ కోట్ జిల్లాకు చెందిన కరడు గట్టిన దొంగలు రమేష్, సుంకప్ప, రాయన్నలను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. పులివెందుల రూరల్ పరిధిలో జరిగిన చోరీలు, చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో రాష్ట్రానికి చెందిన మరో గ్యాంగ్ లో కరడు గట్టిన దొంగలు మల్లికా శ్యామల, మల్లికా వెంకటేష్, మల్లికా ఇరువరం రాజు, మల్లికా అంజి, మల్లికా ఇంద్ర, రాగి నాగరాజు లు వెల్లడించారు. కడప వన్ టౌన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో రూ. 5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, మోటార్ బైక్ స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరులను అరెస్ట్‌ చేయడంలోకీలకపాత్ర పోషించిన పులివెందుల రూరల్ సీఐ బాల మద్దిలేటి, కడప వన్ టౌన్ సీఐ నాగరాజు, పులివెందుల అర్బన్ సీఐ రాజు , వేముల ఎస్సై ధనుంజయుడు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.