చేతల ప్రభుత్వం

వార్తలు
157 Views

వై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో కడప మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో జగనన్న తోడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజల భాధలు తెలుసుకొని మ్యానుఫెస్టో తయారు చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. హామీలన్నీ ఒక్కొక్కటిగా ఏడాది కాలంలోనే 95 శాతం నెరవేర్చారని, ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. జగనన్న తోడు కార్యక్రమంతో పేద చిరు వ్యాపారస్తులకు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేలు అందించడం జరుగుతోందని, ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా చెల్లించాలన్నారు. రుణం పూర్తయిన వెంటనే మరోసారి రూ.10 వేలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జగనన్న తోడు, ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 9, 751 మంది చిరు వ్యాపారులకు రూ.9,75,10,000 మెగా చెక్కును ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *