మైదుకూరు మండలం వనిపెంటలో శనివారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో దాదాపు పది వేలకు పైగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు వివరించారు. యువత ఎక్కువ శాతం అంతర్జాలం ద్వారా సభ్యత్వ నమోదు చేసుకున్నట్లు వెల్లడించారరు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి, సభ్యత్వ నమోదు స్వీకరించే వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను వివరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారికి జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు పందిటి మల్హోత్రా, గోశెట్టి రఘుపతి, కృష్ణమూర్తి, వ్యాసం రంగ విశ్వనాధ్, వీరభద్రుడు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.