జిల్లా జాయింట్ కలెక్టర్‌గా  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చిన పి.కోటేశ్వరరావు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జ్‌ జాయింట్‌ కలెక్టరుగా ఉన్న నాగేశ్వరరావు నుంచి బాధ్యతలను స్వీకరించారు. భూ, పౌరసరఫరాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పదవీ బాధ్యతలు స్వీకరించిన జేసీ పేర్కొన్నారు. జేసీగా పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. పదవీ బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఈశ్వరయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి వెంకటరమణ,  కలెక్టరేట్ పర్యవేక్షకులు గంగయ్య, జీవన్, డీఎస్‌వో సౌభాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.