1807లో బద్వేలు, జమ్మలమడుగు, దువ్వూరు, బద్వేలు, సిద్ధవటం, చెన్నూరు, చింతకుంట, కమలాపురం, పులివెందుల, రాయచోటి, కంబం, గిద్దలూరు, ధూపాడు, కోయిలకుంట్ల, నొస్సం, గుర్రంకొండ, పుంగనూరు తాలుకాలు ఉండేవి.
1807 తర్వాత జరిగిన మార్పుల పర్యవసానంగా చింతకుంట, .నొస్సం తాలూకాలు కొయిలకుంట్ల తాలూకాలో విలీనమయ్యాయి. 1856లో పులివెందుల తాలూకాను రెండుగా చేసి పులివెందుల, కదిరి తాలూకాలుగా మార్చడంతోపాటు మదనపల్లె తాలూకాను కడప జిల్లాలో చేర్చారు.
1858లో మార్పులు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా నుంచి కంబం, కోయిలకుంట్ల, ధూపాడు తాలూకాలను వేరు చేశారు. కడప నుంచి వేరుచేసిన తాలూకాలతోపాటు మరికొన్నింటిని కలిపి కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు.
1860లో చెన్నూరు, కమలాపురం తాలూకాలను కలిపి కడప తాలూకాగా చేశారు. ఆతర్వాత కొంతకాలానికి కమలాపురం తాలూకాను ఏర్పాటు చేశారు.
1863లో దువ్వూరును ప్రొద్దుటూరుకు, చిట్వేల్‌ను పుల్లంపేటకు మార్చారు. 1899లో పుల్లంపేటను రాజంపేటకు మార్పు చేశారు.
1910లో కదిరిని అనంతపురంలో విలీనం చేశారు.
1911లో వాయల్పాడు, మదనపల్లె తాలూకాలను చిత్తూరులో విలీనం చేశారు.
1911 తర్వాత కడప జిల్లా 9తాలూకాలతో ఉండగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు 1985లో మండల వ్యవస్థను అందుబాటులోకి తేవడంతో జిల్లాను 50 మండలాలుగా విభజించారు. 1996లో కాశినాయిన మండలం అవతరించింది.