Friday, March 29, 2024

కుందూనది

కుందూనదిని కుముద్వతి అని పిలిచేవారు. కృష్ణాబేసిన్ నుంచి పెన్నాబేసిన్ వరకు ప‌రుగులు తీసే కుందున‌దికి  చ‌రిత్ర ఉంది. అటు క‌ర్నూలు జిల్లా ఇటు క‌డ‌ప జిల్లాలో భూగర్భజలాల అభివృద్దికి దోహ‌ద‌ప‌డుతోంది. ప్రత్యక్షంగా అందక పోయినా ఎంద‌రో రైతుల‌కు ప‌రోక్షంగా సాగునీరు అందుతోంది.  ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను  ఏర్పాటు చేసి వందలాది ఎకరాలకు సాగునీరు కల్పిస్తున్నారు.   క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఓర్వకల్లు మండ‌లం ఉప్పలపాడు గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మయ్యే కుందున‌ది 280 కి.మీ. ప్రయాణించి క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం స‌మీపంలోని  పెన్నాన‌దిలో క‌లుస్తుంది. కుందూనదికి గాలేరు, జ‌ర్రేరు, పాలేరు వంటి ఉప‌న‌దులు ఉన్నాయి. మ‌ద్ధిలేరు, వ‌క్కిలేరు, భ‌వ‌నాసి, నిప్పుల‌వాగు, సంక‌ల‌వాగు వంటి ఇందులో క‌లుస్తాయి. వ‌ర్షాకాలంలో ఉర‌కలెత్తే కుందున‌ది ద్వారా ప‌రివాహ‌క ప్రాంతంలోని గ్రామాల‌కు చేర‌డం, పంట‌ల‌ను తుడిచిపెట్టి రైతుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగిస్తోంది. నల్లమల, ఎర్రమల కొండ‌ల మ‌ధ్య కుందున‌ది ప్రవహించడంతో కుందూ నాగ‌రిక‌త అని పిలిచేవారు. న‌దికి ఇరువైపులా నల్లరేగడి నేల‌లు ఉండ‌టంతో నల్లరేగడి అనే వారు.  రానురాను రేగ‌డినాడుగా పిలిచేవారు. రేగ‌డినాడును ప‌రిపాలించిన రాజుల‌ను రేనాటిరాజులుగా పిలిచేవారు. చోళులు, పల్లవులు, గుప్తులు, కాక‌తీయ‌రెడ్డిరాజులు, తుళువంశ‌పురాజులు, అర‌వీటిరాజులు ఒక‌రేమిటి పాలెగాళ్లు న‌వాబులు, ఆంగ్లేయులు ప‌రిపాలించారు. క‌ర్నూలు జిల్లాలో నందికొట్కూరు, నంద్యాల‌, ఆత్మకూరు, పాణ్యం, కోయిలకుంట్ల, నియోజ‌క‌వ‌ర్గాలు, క‌డ‌ప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా ప్రవహిస్తుంది. కుందూనదిని కుముద్వతి అని పిలిచేవారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular