కుందూనదిలో నిలకడగా నీరు ప్రవహిస్తోంది. రాజోలి ఆనకట్ట వద్ద 3691 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్లు అధికారులు లెక్కించారు. రాజోలి ఆనకట్ట వద్ద నుంచి కేసీకాల్వకు 587క్యూసెక్కులు మళ్లించారు. కుందూనదిలో నీటి ప్రవాహం కారణంగా పెన్నానదిలో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద 3263 క్యూసెక్కలు ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలోకి నీటి చేరిక కొనసాగుతున్నంత వరకు కుందూనదిలో ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా వాసులు, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ప్రజల దాహార్తి తీర్చేలా పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేయడంతో కుందూనదిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది.