జిల్లాలో అభివృద్ధి పనులు కోసం భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో భూసేకరణపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కడప జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారని, పథకాలు అమలు చేయడానికి అవసరమైన భూసేకరణను అన్ని శాఖలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా నుంచి వెళ్లే జాతీయ రహదారుల విస్తరణకు గాను ఎన్ హెచ్ 18 లో రాయచోటి నుండి కడప మార్గంలో జరుగుతున్న పనులకు సంబంధించి ఈ నెల 25 లోగా త్రీడి ప్రతిపాదనలు ఇవ్వాలని ఎన్ హెచ్ అధికారులను ఆదేశించారు. అలాగే రాయచోటి నుండి అంగళ్లు వరకు రెండు లైన్ల రహదారి విస్తరణ కు సంబంధించి 13 ఏకరాలకు త్రీడి పంపారని, కొత్తగా తీసుకు 1.65 ఏకరాలకు సర్వే పూర్తికాగా మిగిలిన పనులను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత ఆర్డీఓ, ఎన్ హెచ్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు డివిజన్ లో ఎన్ హెచ్ 67లో 7.11 ఏకరాలకు అవార్డ్ పాస్ చేసారన్నారు. ఎన్ హెచ్ లో ఆర్ అండ్ బి రోడ్స్ కు సంబంధించి పొరుమామిళ్ల నుంచి సీతారామ పురం మీదుగా సిఎస్ పురం వరకు ఎన్ హెచ్ 167బి లో అవసరం అయిన 40 ఎకరాలు భూసేకరణ కు త్రీసి ప్రతిపాదనలను వచ్చే బుధవారం లోగా పంపాలని రాజంపేట ఆర్డిఓ ను ఆదేశించారు. ఈ మార్గంలో ఉన్న అటవీ భూములను డిఎఫ్ఓ, ఆర్డీఓ లు సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ హై వే కు 64 కిమీ లు భూసేకరణ చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ హెచ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవరమైన మేర సర్వేయర్ల టీం లను ఏర్పాటు చేసుకొని త్వరితగతిన సర్వే పూర్తిచేయాలని చెప్పారు. కడప నుంచి కర్నూలు వరకు చేపట్టిన 4/6 లైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 643 ఎకరాలు భూసేకరణ పూర్తి ఐయిందని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మైదుకూరు నుంచి బద్వేలు వరకు 2/4 రహదారి భూసేకరణ ప్రగతిని సమీక్షించారు. జిల్లాలోని మునిసిపాలిటీ పట్టణాలలో చేపట్టిన గృహ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయడానికి సంబంధింత మునిసిపల్ కమిషనర్లు ఆర్డీఓ లతో సమన్వయంతో చేసుకివాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి అలియనేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొప్పర్తి వద్ద నిర్మించే మెగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం 3600 ఎకరాలు, సికే దిన్నె, వల్లూరు మండలాల్లో ప్యాకేజ్ 33 నుండి 36 వరకు సేకరించాల్సిన 6వేల ఎకరాలు, 46 ఎకరాలలో తాళ్ళపాక వద్ద, 98 ఎకరాలలో పలుగురాళ్ల పల్లి, జమ్మలమడుగు డివిజన్ అంబవరం లో 153 ఎకరాలులో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎమ్ఇ పార్క్ ల భూసేకరణ ప్రగతి ని సమీక్షించారు. అలాగే గాలివీడుమండలంలో 3200ఏకరాలలో ఏర్పాటు చేయనున్న సోలార్ విండ్ ప్రాజెక్ట్, జమ్మలమడుగు, మైలవరం, కొండాపురం మండలాలలో నెడ్ క్యాప్ ద్వారా చేపట్టే ప్రాజెక్ట్స్ భూసేకరణ పనులను సమీక్షించి తగు సూచనలు, సలహాలను జారీ చేశారు. ఈ సమావేశంలో ఎన్ హెచ్ డిఇఇ శ్రీనివాస మూర్తి, ఆర్ అండ్ బి ఎస్ ఈ వెంకటరమణ రెడ్డి, ఇఇ లి చంద్రశేఖర్, సురేందర్ రావు, టీజీపీ ప్రాజెక్ట్ ఇ ఇ ప్రతాప్, డిటిసి బసిరెడ్డి, ఎస్ డిసి రాఘవేంద్ర, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డిఓ లు దేవేందర్ రెడ్డి, వీరబ్రహ్మం, నాగన్న, ఏపీ ఐ ఐ సి జెడ్ ఎమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.