మాదా ఆంజనేయులు. మైదుకూరులోని రెవెన్యూ కాలనీకి చెందిన వారు. 1984లో జూనియర్ అసిస్టెంట్‌గా సిద్ధవటంలో విధుల్లోకి చేరారు. 1990లో సీనియర్ అసిస్టెంట్, 1991 రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆతర్వాత ఉప తహసీల్దారుగా నియమితులై 2013లో పదవీ విరమణ చేశారు. 2015నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30బాలల కథలు, ఇతర కథలు 32రాశారు. లోపలి మనిషి, అమ్మప్రేమ కథలు ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. తెలుగువెలుగులో లంచం చేసిన మనిషి కథ ప్రచురితమైంది. చతుర, విపుల, ప్రజాశక్తితోపాటు ఆన్లైన్ పత్రికల్లోనూ కథలతోపాటు కార్టూన్లు ప్రచురితమయ్యాయి. ఒక నవల రాశారు. అమ్మ ప్రేమ కథ కన్నడంలోకి అనువదించబడి, కన్నడ పత్రికలో ప్రచురితమైంది.
జన్మించిన తేది | 1955 మార్చి 1 |
తల్లిదండ్రులు | శేషరత్నమ్మ, సుబ్బయ్య |
భార్య | భారతి |
సంతానం | కావ్య శేషచంద్ర, శౌర్య శేషచంద్ర |
కలం పేరు | శేషచంద్ర |