1976లో నిడిజువ్వి సర్పంచిగానూ, 1978లో కమలాపురం సమితి ప్రెశిడెంట్గానూ ఉన్నారు. 1983లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మైసూరారెడ్డి తెలుగుదేశం ప్రభంజనంలో కొట్టుకుపోయారు. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వడ్లమాని వెంకటరెడ్డి చేతిలో 6,095 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. 1985లో పోటీ చేసిన మైసూరారెడ్డి 31,240 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 1989లో 38,727 ఓట్ల ఆధిక్యత పొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గండ్లూరి వీరశివారెడ్డి చేతిలో 6,163ఓట్ల తేడాతో రెండోసారి ఓటమిని చవిచూశారు. 1999లో అదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గండ్లూరి వీరశివారెడ్డిపై 10,602 ఓట్ల ఆధిక్యత మూడవసారి శాసనసభ్యడిగా ఎంపికయ్యారు.
రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2004 ఎన్నికల సమయంలో మైసూరారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2004లో జరిగిన 14వలోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వై.ఎస్.వివేకానందరెడ్డి చేతిలో 1,31,674 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్తో విబేధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్న వై. ఎస్.జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ సభ్యత్వానికి 2010 నవంబరు 29న రాజీనామా చేయడంతో 2011 మేలో నిర్వహించిన ఎన్నికల్లోనూ మైసూరారెడ్డి మరోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
రాజ్యసభ
ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మైసూరారెడ్డికి 2006 రాజ్యసభ సభ్యునిగా చేసి గౌరవించింది. 2006 ఏప్రిల్ 3వతేదీన ఎంపికైన మైసూరారెడ్డి పదవీ కాలం 2012 ఏప్రిల్ 2వతేదీ నాటితో ముగిసింది.