మైదుకూరులో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహానాడును తలదన్నేలా మినీ మహానాడును నిర్వహించనున్నారు. నియోజకవర్గం నుంచి దాదాపు నాలుగువేల మంది కార్యకర్తలు పాల్గొంటారనే ఆలోచనతో స్థానిక తెలుగుగంగ కాలనీలో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికతోపాటు కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా చలువ పందిర్లు వేశారు. కాలనీలో వేదిక ఏర్పాటు చేస్తున్న ప్రాంతంతోపాటు పోరుమామిళ్ల, బద్వేలు రోడ్లలో పార్టీ పతాకాలతో పసుపు మయం చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడైనా తితిదే పాలకమండలి ఛైర్మన్ కావడంతో మినీ మహానాడును ఘనంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు పాల్గొంటున్న మినీ మహానాడులో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై పార్టీ నాయకులు శాఖల వారీగా కార్యకర్తలకు వివరించనున్నారు. చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు వివరించడం ద్వారా పార్టీకి లబ్ది చేకూర్చేలా చేయాలని నాయకులు భావిస్తున్నారు.
మహానాడును తలదన్నేలా మినీ మహానాడు
516 Views