కడప జిల్లా మైదుకూరు వద్ద టమోటాలతో వెళ్తున్న మినీ వాహనం బోల్తాపడింది. చిత్తూరు జిల్లా కలకడ నుంచి కర్నూలుకు వెళ్తూ ఉండగా డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. వాహనంలో టమోటాలతో ఉన్న ప్లాస్టిక్‌ట్రేలు చెల్లా చెదురుగా పడ్డాయి. హైవే సిబ్బంది సంఘటనా స్థలం చేరుకుని రోడ్డుపై బోల్తాపడిన వాహనాన్ని తొలగించారు.