ysrkadapa

నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం

వార్తలు
138 Views

2019 నేషనల్ వాటర్ అవార్డ్స్ లో నీటి సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. కేంద్ర జల్ శక్తి అభియాన్ ప్రాజెక్టు పనుల నిర్వహణకు సంబంధించి.. బుధవారం రెండవ జాతీయ నీటి సంరక్షణ అవార్డుల ఎంపిక చేశారు. ఇందులో సౌత్ రీజన్ స్థాయిలో జిల్లాకు ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, కేంద్ర జల్ శక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి సురేష్ కుమార్ లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కు అభినందనలు తెలిపారు.

గత పదేళ్లుగా నమోదైన వర్షపాత వివరాల ఆధారంగా పురస్కారం లభించింది. ఉపాధి హామీ పనులు, ఇతర పనుల ద్వారా చేపట్టిన జల సంరక్షణ పనుల నిర్వహణలో భాగంగా.. ఉత్తమ ఫలితాలు సాధించడంతో అవార్డు దక్కింది. వాటర్ కన్జర్వేషన్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్వహణలో 1,92,103 పనులకు 52,890 పనులను జియో టాగ్ చేశారు. రినోవేషన్ ఆఫ్ ట్రెడిషనల్ మరియు ఇతర నీటి వనరులు, చెరువు పనులకు సంబంధించి 25,617 పనులకు గాను 23,765 పనులు జియో టాగ్ చేయడం చేశారు. రి యూస్ అండ్ రిచార్జి స్ట్రక్చర్ పనులకు సంబంధించి 23,447 పనులకు గాను 10,823 పనులు, వాటర్ షెడ్ డెవెలప్మెంట్ కింద 48,304 పనులకు 28,410 పనులను జియో టాగ్ చేశారు. శాస్త్రీయంగా పరిగణలోకి తీసుకుని కేంద్ర జల్ శక్తి అభియాన్ అవార్డుల ఎంపికలో మన జిల్లా సౌత్ రీజన్ స్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని సాధించింది.

అవార్డు కైవసం – గత నేపథ్యం

ఏడేళ్లలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో.. ప్రతి ఖరీఫ్ సీజన్ పంటల విస్తీర్ణంపై ఆ ప్రభావం చూపేది. అధిక బోరు బావుల వినియోగంతో… భూగర్భ జల నీటిని వినియోగించుకొని ఖరీఫ్ పంటలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏటా 5వేలు నుంచి 8వేల వరకు బోరు బావులు కొత్తగా తవ్వేవారు. బావుల సంఖ్య అధికంగా పెరగడంతో.. గడిచిన రెండు సంవత్సరాల్లో 15 % నుండి 25 % బోరు బావులు అడుగంటిపోయే పరిస్థితి ఎదురైంది. 2009-10 నుంచి 2019-20 అనగా 11 సంవత్సరాల కాలంలో ఏడేళ్ల పాటు భూగర్భ జల కరువు సంవత్సరాలుగా పరిగణించారు. అక్టోబర్, 2001 నుంచి నవంబర్ 2019 కాలం లో భూగర్భజల మట్టం 9.15 మీ నుంచి 19.33 మీ లోతుకు పడిపోయింది. పరిస్థితులను అధిగమించేందుకు భూగర్భ జల శాస్త్రవేత్తల సహకారంతో వివిధ రకాల కృత్రిమ భూగర్భ జలవృద్ధి నిర్మాణాలైన 289 చెక్ డ్యాంలు , 912 నీటి నిల్వ చెరువులు , 17,583 వ్యవసాయకుంటలు , 108.90 లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు పూడిక తీత పనులు తదితర 17499 భూగర్భ జల వృద్ధి నిర్మాణాలను 2018-19 సంవత్సరంలో నిర్మించారు.

నీటిని సక్రమంగా సద్వినియోగానికి బిందు, తుంపర సేద్యం వంటి నూతన యాజమాన్య పద్ధతులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించారు. ప్రస్తుత సంవత్సరం 3.57 TMC ల భూగర్భ జలం వివిధ వర్షపాతం క్రిందఏర్పాటు చేసిన నిర్మాణాల వలన వృద్ధి చెందింది. అలాగే … 12797 బోరు భావులలో నీరు వృద్ధి చెందడం వలన 31,994 ఎకరాల భూమి పరోక్షంగా నీటి పారుదల జరిగింది . ఇదే కాకుండా 45.961 TMC నీటిని తెలుగు గంగా ప్రాజెక్టు , GNSS మరియు KC కాలువ ద్వారా 8 చెరువులు మరియు 105 చెక్ డ్యామ్స్ నీటితో నింపడమైనది. వీటి వలన 18.38 TMC నీరు భూగర్భ జలము వృద్ధి చెంది, 65,888 బోరు బావులు ప్రభావితమై దీని వలన 1,64,722 ఎకరాల ఆయకట్టు పరోక్షంగా పారుదలకు దోహదపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *