పేద ప్రజల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు అన్నారు. పేర్కొన్నారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ఏర్పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందన్నారు. సోమవారం కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం, పాత బస్టాండ్ అన్న క్యాంటిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే రోజుల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లలో ఐదు రకాల విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని కేవలం 5 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు తమ పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వచ్చిన సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ. 5లకే రుచికర భోజనం అందించడం జరుగుతుందన్నారు. పేద ప్రజల కొరకే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, జల్సా చేసే వారి కోసం కాదన్నారు. ఏవైనా శుభ కార్యాలు చేసుకునే వారు అన్న క్యాంటీన్ లకు విరివిగా విరాళాలను అందించాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణానికి జీవనోపాధికి వలస వచ్చిన ప్రజలకు అక్షయ పాత్రలా ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లు 5 రూపాయలకే భోజనం అందించడం జరుగుతున్నదన్నారు. రోడ్లపై ఉన్న ప్రజలు తక్కువ ధరతో కడుపునిండా భోజనం అందించే అన్న క్యాంటీన్లకు వస్తారని వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా భోజనం అందించాలని తెలిపారు. ఎన్టీఆర్ అన్న కాంటీన్ నందు ఒక్క రోజుకు 15 రూపాయలకే ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ భోజనంలో శుభ్రత, నాణ్యత రుచికర మైన ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందిస్తారని తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ లవన్నలు భోజనం రుచి చూశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి, డిప్యూటీ మేయర్ ఆరిఫ్ ఉల్లా, టిడిపి నాయకులు హరి ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి,జిలాని భాష, సుభాన్ భాష, పీరయ్య, కార్పొరేటర్లు ఆజీమున్నిసా , రషీద్, అధికారులు ఇతరులు పాల్గొన్నారు.