ప్రొద్దుటూరులోని బొల్లవరంలో మంగళవారం నిర్వహించే ధర్మ పోరాట దీక్ష ఏర్పాట్లను తెదేపా నాయకులతోపాటు అధికారులు ఆదివారం పరిశీలించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ హరి కిరణ్, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడా, జిల్లా తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి లు హెలిప్యాడ్, సభాస్థలి, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం శిలాఫలకాన్ని పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రోటోకాల్ పాటించి వచ్చినవారికి సీట్ల ఏర్పాట్లు, నీటి వసతి, శానిటేషన్ పనులు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నయీం హస్మి, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, తెదేపా నాయకుడు ఎం లింగారెడ్డి, సేటు గురివిరెడ్డి, సీఎం సురేష్ నాయుడు, వీరశివారెడ్డి ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు.