పర్యాటక కేంద్రమైన గండికోటలో పర్షియన్ శాసనం వెలుగు చూసింది. గండికోట పెన్నాలోయలో దక్షిణం వైపు ఒడ్డున రాతిపై మలచబడి ఉన్నట్లుగా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఎపి గ్రఫీ విభాగం డైరెక్టర్ ఆచార్య మునిరత్నం రెడ్డి తెలిపారు. హిజ్రి సంవత్సరం 1181లో నాటి పాలకుడు, కడప నవాబు సయీద్‌మియా అక్కడ పర్హాభాగ్ తోట నిర్మాణ సమయంలో ఫౌంటెన్ నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నట్లుగా వివరించారు.