ఈనెల 19 మరియు 20 తేదీ లలో  ఎలక్ట్రరోల్ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని, ఓటర్లు తమ పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, చిరునామాలో తేడాలు ఉంటే సరి చేసుకోవాలని డిప్యూటీ ఎన్నికల అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి రఘునాథ్ తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ సరి చేసుకోవచ్చునని సూచించారు.  ఇప్పటిదాకా 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారిలో 6 లక్షల 50 వేల మంది సరి చేసుకున్నట్లు వివరించారు. 19, 20వ తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వస్తున్నట్లు తెలిపారు.   ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌వోలు ఓటర్ల జాబితాతో ఉంటారని ఓటర్లు అక్కడికి వెళ్లి వారి పేరులో, పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లలో వయస్సు, చిరునామాలో  వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో  సరి చూసుకోవాలన్నారు.  బీఎల్‌వోలు  మొబైల్ యాప్ కలిగి ఉంటారని ఉంటారని వివరించారు. ఓటర్లు తమకు సంబంధించిన ఏదో ఒక గుర్తింపు కార్డును ఓటరు గుర్తింపు కార్డుతో పాటు తమ వెంట తీసుకుని వెళ్లాలని కోరారు.