జిల్లాలోని సోమశిల వెనుక జలాలు, గండికోట, బ్రహ్మంసాగర్ జలాశయాల్లో జులై, ఆగస్టు నెలల్లో చేపల వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు విజయరామరాజు ఆదేశించారు. జులై, ఆగస్టు నెలల్లో చేపల వేట నిషేధంపై కలెక్టరు కార్యాలయంలో మత్స్య, అటవీ, పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జులై, ఆగస్టు నెలలు చేపలు గుడ్లు పెట్టే కాలం కావడంతో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఆసమయంలో చేపల వేట నిషేధం అమలు చేయాలని ఆదేశించారు.