కుందూనదిపై రాజోలి జలాశయం నిర్మించాలనే డిమాండుతో మైదుకూరు ఎమ్మెల్యే ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దువ్వూరులోని కోదండరామాలయం నుంచి ప్రారంభించిన నిరసన ప్రదర్శన మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు మీదుగా కడప కలెక్టరేట్‌ వరకు సాగింది. 2008లో 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేయగా రాజశేఖరరెడ్డి మరణానంతరం నియమితులైన ముఖ్యమంత్రులు పట్టించుకోక పోవడం.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లైనా నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టక పోవడాన్ని నిరసిస్తూ రాజోలి జలాశయ సాధన కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు నగర మేయర్‌ సురేష్‌బాబు ట్రాక్టర్ల ప్రదర్శనలో పాల్గొన్నారు. కేసీకాల్వ ఆయకట్టు పరిధిలోని రైతులు తమ ట్రాక్టర్లతో ప్రదర్శనలో పాల్గొన్నారు.