ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం – 2019 ప్రకారం పట్టాదారులు వారే నేరుగా వారి భూముల్లో ఇసుక త్రవ్వుకునే అవకాశం లేదని జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి తెలిపారు.
పట్టా భూముల్లోని ఇసుక మేటలను తొలగిస్తే సాగు యోగ్యం అవుతుందో ఆభూములకు సంబంధించి పట్టాదారులు వారి పట్టాదారు పాసుపుస్తకం నకలు, టైటిల్ డీడ్‌ నకలు, గ్రామపటంలో పట్టా భూమి ఎక్కడ ఉందో గుర్తించే పటం జత చేసి జిల్లా పాలనాధికారికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అనుమతి పొందిన తర్వాత భూమిలో లభ్యమయ్యే ఇసుకను తవ్వేందుకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్న తర్వాత ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా సదరు పట్టాదారుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర క్యూబిక్ మీటర్ కు రూ.100 లు చెల్లించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని పట్టా భూములను వ్యవసాయ యోగ్యంగా చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కోరారు.