ysrkadapa

వార్తలు

గాయకుడు ధర్మిశెట్టి శ్రీనివాస్‌ను సత్కరించిన పుట్టా

మైదుకూరుకు చెందిన గాయకుడు ధర్మిశెట్టి శ్రీనివాస్‌ తితిదే మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసంద్భంగా సుధాకర్‌యాదవ్‌ శ్రీనివాస్‌ను శాలువాకప్పి సత్కరించారు. ఇటీవల ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం నిర్వ‌హించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పోటీలో శ్రీ‌నివాస్ మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి రూ.3ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అందుకున్న విషయం తెలిసిందే. పోటీలో రాణించిన శ్రీనివాస్‌ను భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకుని ఉత్తమ గాయకుడిగా రాణించాలని ఆకాంక్షిస్తూ అభినందించారు.