ysrkadapa

వార్తలు

చంద్ర‌బాబుతో పుట్టా భేటీ

మైదుకూరు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ సోమవారం రాత్రి చంద్ర‌బాబునాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన కలుసుకుని చర్చలు జరిపారు. జిల్లా రాజకీయాలతోపాటు నియోజకవర్గ రాజకీయంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసి ప్రచారం చేసుకోవాల్సింగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచించినట్లుగా సుధాకర్‌యాదవ్‌ తెలిపారు.రాబోయే రెండు నెలల్లో ప్రకటించే 50మంది అభ్యర్థుల తొలిజాబితాలో మీపేరు కూడా ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు సుధాకర్‌యాదవ్‌ తెలిపారు.