ysrkadapa

వార్తలు

నియోజకవర్గంలో పుట్టా పర్యటనలు

తెదేపా మైదుకూరు నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ దువ్వూరు మండలం చిన్నసింగనపల్లె ఎస్సీకాలనీలో సీఎస్‌ఐ చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. చాపాడు మండలం భద్రిపల్లెలో వీరయ్య స్వామి తిరునాల మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కమిటి నిర్వాహకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించారు. బీమఠం మండలం నందిపల్లెలో సీతారామ స్వామి వారి విగ్రహం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.