రాష్ట్రంలోని నిరుపేదలకు 5 లక్షల నాణ్యమైన ఇళ్ళు నిర్మిస్తున్నామని రాష్ట్ర మునిసిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గురువారం కడపకు వచ్చిన మంత్రి ఈసందర్భంగా కడప రిమ్స్ వెనుకభాగాన ఏపిటిడ్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీని, కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి అయిన ఒక నమూనా ఇంటిలోని వంట, పడక, స్నానపుగదులను పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తునట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా షీర్ వాల్ టెక్నోలజీతో అధిక నాణ్యత కలిగిన ఇళ్ళ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నరాఉ. 15నెలల్లో ఐదు లక్షల ఇళ్ళను పూర్తి చేసేలా ప్రణాళికలు చేసి ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. కాలనీలో రోడ్లు, మురుగుకాల్వలు, తాగునీరు, విద్యుదీకరణ  చేస్తున్నామని, పాఠశాల, ఆసుపత్రి, దుకాణ సముదాయం, సామాజిక భవనంతో పూర్తి స్థాయి ఇళ్ళను నిర్మిస్తున్నామని తెలిపారు. భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పారు. ధనవంతుల ఇళ్ళలాగానే అత్యున్నత ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మిస్తున్న ఇళ్లపై విమర్శలు చేసేవారు పరిశీలించాలనానరు. ఎవరెన్ని అడ్డంకులు, సృష్టించినా వెనకడుగు వేయబోమన్నారు.  భూకంపాలను కూడా తట్టుకునే సామర్ధ్యంతో ఇళ్లను నిర్మిస్తున్నామని, ఇళ్ళ నిర్మాణాల్ళో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనానరు. 15 నెలల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని,  ఇది భారతదేశంలో ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు.  జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం పాటుపడే ముఖ్యమంత్రి పేదవారి కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశ్యంతో నాణ్యమైన ఇళ్ళను నిర్మిస్తున్నట్లు చెప్పారు. విశాలమైన రోడ్లు, ఎల్ఈడీ బల్బులు, తాగునీరు, భూగర్భ మురుగుకాల్వ, ఆస్పత్రి,  అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, దుకాణాల సౌకర్యాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి, మంత్రి  కృషి చేస్తున్నట్లు తెలిపారు.  జమ్మలమడుగులో కూడా పేదవారి కోసం ఇళ్ళ నిర్మాణాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకు ముందుగా రిమ్స్ ఆస్పత్రిలో ఎంఎల్సీ బిటెక్ రవి గారిని మంత్రి నారాయణ పరామర్శించారు. బిటెక్ రవి గారి ఆరోగ్య పరిస్థితిపై రిమ్స్ వైద్యులు ఆర్ఎమ్వో డా. వెంకటేశ్‌తో మంత్రి నారాయణగారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం దీక్ష చేస్తున్న ఏంపి సిఎం రమేష్ గారి దీక్షా శిబిరానికి వెళ్లి వారిని పరామర్శించారు. నగరపాలక కమీషనర్ లవన్న, ఇళ్ళ నిర్మాణ సంస్థ ఏజీఏం రామచంద్ర రావు తదితరులు ఉన్నారు.