రాచమల్లు శివప్రసాదరెడ్డి

ఎన్నికల ఫలితాలు
802 Views
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాచమల్లు శివప్రసాదరెడ్డి అంచెలంచెలుగా ఎదిగన రాజకీయ నాయకుడిగా చెప్పవచ్చు. ఎక్కడ పోటీ చేసినా అపజయమెరగక పేదల ఆర్థిక స్వావలంబన కోసం స్వంతంగా రుణాలను అందిస్తూ ప్రజల మనసును చూరగొంటునారు. 1996లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాచమల్లు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కొత్తపార్టీ వైఎస్సార్‌ సీపీ ఏర్పాటుతో ఆపార్టీలోకి వెళ్లారు.
1998లో ప్రొద్దుటూరు పురపాలికలో 29వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2000 సంవత్సరంలో ఇదే వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. 2003లో వైస్‌ ఛైర్మన్‌గా 9ఓట్లతో గెలుపొందారు. 2004 అక్టోబరు నుంచి 2005 మార్చి వరకు బాధ్య ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో జరిగిన ప్రొద్దుటూరు పుర ఎన్నికల్లో 29వార్డులో తన సతీమణి రమాదేవి, 28వ వార్డులో బావమరది పాతకోట బంగారు మునిరెడ్డి భార్య కృష్ణవేణిని వైకాపా తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు.
2009 ఏప్రిల్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మల్లేల లింగారెడ్డికి మద్దతును ఇచ్చి ఆయన గెలుపుకు సహకారం అందించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో వై.ఎస్‌.జగన్‌ వెంట నడచిన రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం శ్రమించారు. 2014 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు.

రాచమల్లు బయోడేటా


తల్లి రత్నమ్మ
తండ్రి శివశంకర్‌రెడ్డి
జననం 1966 డిసెంబరు 20
స్వంత గ్రామం సింహాద్రిపురం మండలం పైడిపాళెం
విద్యార్హత డిగ్రీ
భార్య రమాదేవి (కౌన్సిలర్‌)
పిల్లలు పల్లవి, కృష్ణకావ్య
2014 ఎన్నిక ఫలితం

మొత్తంఓట్లు 232284
చెల్లిన ఓట్లు 181423
తిరస్కరించిన ఓట్లు 33
నోటా 1179
విజేత రాచమల్లు శివ ప్రసాదరెడ్డి
పార్టీ వైఎస్సార్‌సీపీ
లభించిన ఓట్లు 93866
సమీప అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి
పార్టీ తెదేపా
లభించిన ఓట్లు 80921
ఆధిక్యత 12945


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *