Friday, March 29, 2024

రాణిరుద్రమదేవి వీరగల్లు

ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ గణపతి దేవుని కాలంనాటి వీరగల్లు విగ్రహం ఒకటి కడప జిల్లా దువ్వూరు మండలం రాంసాయినగర్ సమీపంలో బయల్పడింది. పురావస్తు శాస్త్రవేత్త, మైదుకూరుకు చెందిన శేగినేని వెంకట శ్రీనివాసులు, ఆయన శిష్యుడు రంగస్వామి విగ్రహాన్ని గుర్తించారు. రాంసాయినగర్‌కు దక్షిణ దిశన మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన మంచాల సుబ్బిరెడ్డి పొలంలో విగ్రహం బయటపడగా గట్టున పడేశారు. విషయం తెలిసి శాస్త్రవేత్త శ్రీనివాసులు విగ్రహాన్ని పరిశీలించారు. గణపతిదేవుని కుమార్తె రాణిరుద్రమదేవి యుద్ధ విజేతగా అశ్వంపై వెళ్తున్నట్లుగా ఉందని, వాటి వెనుకే రాజలాంఛనం వరాహం, మరొక అశ్వం దాని పక్కనే యుద్ధవీరుడు ఉన్నారని, పక్కనే గుట్టపై బృహత్ శిలాయుగపు పల్లకి వంటి చిత్ర లేఖనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular