ysrkadapa

వార్తలు

పంట నష్టo జరిగిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్సార్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2021 పరిహారం పంపిణీలో నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తెదేపా నాయకులు జిల్లా కలెక్టరు విజయరామరాజుకు వినతిపత్రం అందజేశారు. పంట సాగు చేసి నష్టపోయినా పరిహారం దక్కలేదని, సాగు చేయని భూ యజమానులకు పెద్ద ఎత్తున పరిహారం అందిందని, అనర్హుల పై విచారణ జరిపి నిజమైన రైతులకు న్యాయం చేయాలని కలెక్టరును కోరారు.