వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గ్రామీణ వాతావరణం, రైతుల ఈతిబాధలు సమాజ పోకడలను ఇతివృత్తంగా చేసుకుని రచనా వ్యాసంగాన్ని చేస్తున్నారు. తరతరాలుగా నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఎలా వదలుకోవాలి. మరో వృత్తిలో ఎలా రాణించాలనే ఆలోచనలో రైతాంగం ఆలోచిస్తోంది. బాధాకరమైనా కఠోర వాస్తవాన్ని తెలియజేయాలనే సంకల్పంతో రచనలు చేస్తున్నారు సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి.
పుట్టినతేది | 1963 ఫిబ్రవరి 16 |
చదువు | బీఎస్సీ, బీఈడీ |
వృత్తి | 1989 నుంచి పాఠశాల ఉపాధ్యాయునిగా |
తల్లిదండ్రులు | సన్నపురెడ్డి చెన్నమ్మ, లక్ష్మిరెడ్డి |
అర్ధాంగి | ఇంద్రావతి |
చరవాణి | 9441287865 |
రచనా వ్యాసంగం | కవిగా, కథకునిగా, నవలకారునిగా 1987నుంచి |
నవలలు | కాడి, పాండవబీడు, తోలుబొమ్మలాట, చినుకుల సవ్వడి, పాలెగత్తె. |
కథలు, కవితలు: | రాత్రిపూజ, వక్రదృష్టి, కడతివేట, గొలుసుల పలక, వీరమరణం, కొత్తదుప్పటి, ఆకలి, నేర్చుకో, మబ్బుల వెన్నెల, అమ్మ, ముస్తాబు, గిరిగీయొద్దు, ఒక్కవానచాలు, రాలిన చింతపండు, తడి, కొడుకుకూతురు, వాళ్లు మాపార్టీకాదు, చనుబాలు, కొక్కొరోకో, అంటు, ఏడోకడ్డీ, పట్టుచీర, దిగంబరం, కన్నీటికత్తి, పునాది, బొగ్గులబట్టి, ప్రతిమలమంచం, వసంతం, నేనుతను, పాటలబండి, కొమ్ములు, ఎంతెంతదూరం, దెబ్బ, ఆవుచూపు, తమ్ముడి ఉత్తరం, వీరనారి, గంపెడుగడ్డి, పేడదెయ్యం, బతుకు సేద్యం, భయంనీడ, ఊరిమిండి, అమ్మ. |
* 1984లో ఆంధ్రప్రభ నిర్వహించిన కథల పోటీలో ఒక్కవానచాలు కథకు ద్వితీయ బహుమతి.
* 1990లో విశాఖపట్నంలోని సహృదయ సాహితి సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో శైశవశాల కవితకు ఉత్తమ బహుమతి.
* 1996లో అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్, ఆంధ్రప్రభ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో అంతు కథ ప్రథమ బహుమతి.
* 1996లోనే సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో చనుబాలు కథ ప్రథమ బహుమతి.
* 1997 ఢిల్లీ తెలుగు సంఘం అందించిన పురస్కారం.
* 1998లో ఆటా వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన నవలల పోటీలో తొలి నవల కాడి నవలకు ద్వితీయ బహుమతి.
* 1998లో ఉండేల మాల కొండారెడ్డి సాహితీ పురస్కారం.
* 1999లో గౌరు సాహితీ పురస్కారం.
* తెలుగు భాష, సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా 2004లోను, 2006లోను అధికారభాషా సంఘం ఘనంగా సత్కరించింది.
* 2006 ఆటా పోటీలో తోలుబొమ్మలాట నవలకు ప్రథమ బహుమతి.
* 2006లో స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో పాలెగత్తె నవలకు ప్రథమ బహుమతి.
* 2006లో చతుర నిర్వహించిన నవలపోటీలో చినుకుల సవ్వడి ప్రథమ బహుమతి.