ఎర్రగుడి శ్రీనివాసులురెడ్డి . వయస్సు పాతికేళ్లు. స్వగ్రామం మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం మొరాయిపల్లె. కడప కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటేక్ చదివారు. తండ్రి వెంకటరమణారెడ్డి వ్యవసాయదారుడు. పంచాయతీ ఎన్నికల్లో స్ధానిక రాజకీయ పార్టీల నేతల మద్దతు లేకున్నప్పటికీ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. ఏకంగా 654 ఓట్లు సాధించి పల్లె జనాల్లో తనకున్న అభిమానం ఏపాటిదో నిరూపించి రుజువు చేసుకున్నారు. ప్రజాభిమానం ఉంటే ఏ నాయకుడి సహకారం లేకున్నా విజయం సాధించవచ్చునని నిరూపించుకున్నారు శ్రీనివాసులురెడ్డి.
బిటెక్ చదువుతున్న సమయంలో రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఇంటగెలిచి రచ్చ గెలవాలని అనే సిద్ధాంతంతో పంచాయతీ ఎన్నికలపై దృష్టి నిలిపారు. నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల ముందు నుంచి వైసీపీ పార్టీతో అనుబంధం పెంచుకున్నాడు ఆయువకుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి శ్రీను అంటే నమ్మకం. ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పలు దఫాలు కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అభినందించేందుకు తన యువకులతో కలిసి వెళ్లాడు. ఎర్రగుడి శ్రీనివాసులురెడ్డిని కూడా వైఎస్ఆర్ గా మార్చుకుని అందరికీ సుపరిచితులయ్యాడు. తన పల్లె మొరాయిపల్లో సోమాపురం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ గా కేటాయించబడటంతో సర్పంచ్ పదవి పొందాలనే ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కల్గి ఉంటూ.. గ్రామ పంచాయతీలోని యువ బృందంను ఆకట్టుకున్నాడు.. కరోనా సమయంలో చేసిన సేవను ఆపంచాయతీ ప్రజలకు మరవలేదు. తన పంచాయతీలోని పేదలు పనులకు వెళ్లి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని అలమటిస్తుంటే.. వారికి అండగా నిలిచి స్వగ్రామం రప్పించడంలో ‘ శ్రీనువాసులురెడ్డి’ చేసిన మేలు ఆ పల్లె జనం గుండెల్లో దాచుకున్నారు..
పంచాయతీ ఎన్నికలొచ్చాయి.. వైసీపీ పార్టీ నాయకుల అండతో సర్పంచ్ పదవికి పోటీ చేశాడు.. తన ఊహించినట్లే అఖండ విజయం సొంతం చేసుకున్నాడు. శ్రీనువాసులురెడ్డి. నియోజకవర్గంలోని నాయకుల, పార్టీల నేతల సోమాపురం పంచాయతీ వైపు అలా దృష్టి సారించి.. తన గెలుపు గురించి చర్చకు వచ్చేలా చేశారు. వైసీపీ పార్టీ అండ, ప్రజల అభిమానంతో సర్పంచ్ పదవి పొందారు. కృతజ్ఙతతో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలను కలిశారు. తనకు అండగా నిలిచిన నాయకులు, యువకులతో కలసి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వద్దకు వెళ్లి ఘన సత్కారం చేశారు.