ysrkadapa

వార్తలు

రీ సర్వే పనులు వేగవంతం

రెవెన్యూ భూముల స్వచ్చీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పనులు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమీషనర్ జి. సాయి ప్రసాద్ జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష పథకం కార్యాచరణ, అమలుపై జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వే పనులు ప్రణాళికా బద్దంగా వేగవంతంగా చేపడుతున్నాని పేర్కొన్నారు. మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రణాళిక ప్రకారం డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తిచేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా.. లక్ష్యం మేరకు ఓ.ఆర్.ఐ.ఎస్. (ఆర్థో ఇమేజెస్) సాఫ్ట్, హార్డ్ కాపీలను కూడా తీయడం, 13వ నోటిఫికేషన్ వంటి పనులతో రీ సర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ ప్రక్రియను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేంలో జేసీ సాయికాంత్‌ వర్మ, ల్యాండ్ సర్వే శాఖ ఏడీఏ కనక ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.