ysrkadapa

వార్తలు

ఏప్రిల్‌ 15న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

చారిత్రాత్మక ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు, ఏప్రిల్15న సీతారాముల కళ్యాణోత్సవానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం తితిదే కళ్యాణ మండపంలో జేసీ సాయికాంత్ వర్మ, తితిదే జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్‌ 10వతేదీ నుంచి 18వతేదీ వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తితిదే టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లా యంత్రాగం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడంతో రాష్ట్ర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నంఉదన జిల్లా యంత్రాంగం తితిదేతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయం లోపల, కళ్యాణ వేదిక వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం , సీసీ కెమెరాలు, రాత్రి వేళలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్య శాఖ చే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు వంటి అంశాలపై ఈసందర్బంగా సమీక్షించి సూచనలు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో.. మాస్కులు సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, తితిదే అధికారులు సమన్వయంగా బాధ్యతలు నిర్వర్తించి కల్యాణోత్సవం విజయవంతానికి కృషి చేయాలన్నరాఉ. తితిదే జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమన్వయంతో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కల్యాణవేదిక వద్ద భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టరు ఏర్పాటు చేస్తున్నారని, కల్యాణవేదికను సాంప్రదాయ బద్ధంగా, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణలతో అలంకరించనున్నట్లు తెలిపారు. భక్తులకు అందుబాటులో తాగునీరు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాద వితరణ కౌంటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద తాత్కాలిక మొబైల్‌ మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల సౌక ఎపిఎస్‌ ఆర్‌టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వివరించారు. సమావేశంలో తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ డి.నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓలు రమణప్రసాదు, గోవింద రాజన్, విజిలెన్స్ సెక్యురిటి అధికారి మనోహర్, రాజంపేట ఆర్‌డివో చంద్రమౌళి, డ్వామా, డిఆర్డిఎ పీడీ లు యదుభూషన్ రెడ్డి, మురళి మనోహర్, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, కడప మునిసిపల్ కమీషనర్ రంగస్వామి, టూరిజం అధికారి రాజశేఖర్ రెడ్డి, సమాచార శాఖ ఏడి పి వేణుగోపాల్ రెడ్డి, డిపిఆర్ఓ సి హెచ్ పురుషోత్తం, డివిజినల్ పిఆర్ఓ డి మస్తాన్ సాహెబ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శోభ వాలెంటినా, వివిధ శాఖల జిల్లా అధికారులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment