ఓటు హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కుల్లో ఓటు హక్కు ఒకటి. ఓటు హక్కు పొందుల ప్రతి భారత పౌరుని హక్కు.  అందుకే అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం తరచూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా 2019 జనవరి 1వతేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. బూత్‌ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరు వరకు సర్వే సాగనుంది. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి జాబితాలోని ఓటర్లను పరిశీలించారు. ఓటు కుటుంబసభ్యుల్లో ఎవరైనా మృతి చెందిన ఉన్నా, వివాహాలు చేసుకుని వెళ్లిపోయినా అలాంటి వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు స్వీకరిస్తారు.  తప్పులు ఉన్న సరిచేస్తారు. చిత్రాలు సరిగా లేక పోయినా, జాబితాలో మరొకరి చిత్రం చోటు చేసుకున్నా వారి నుంచి చిత్రం సేకరించి  రెవెన్యూ అధికారులతో కలసి ఆన్‌లైన్‌ ద్వారా జాబితాను చక్కదిద్ధేలా చేస్తారు. ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఓటరు వెళ్లి పోయి ఉంటే వారి నుంచి ఫారం-6 స్వీకరించి ఆనియోజకవర్గంలో ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గంలోనే ఒక మండలం నుంచి మరొక మండలానికి వెళితే వారి నుంచి ఫారం-8ఎ సేకరిస్తారు. సెప్టెంబరు 1న సమగ్ర ఓటరు జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అక్టోబరు 31వరకు అభ్యంతరానలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4న తుది జాబితాను ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు అంతర్జాలం ద్వారా దరఖాస్తులను పంపవచ్చు. చరవాణి వచ్చే దరఖాస్తు సంఖ్య ద్వారా తమ దరఖాస్తు ఏస్థితిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.

  • జిల్లాలో 18,66,134మంది ఓటర్లు

మార్చి 24న ప్రకటించిన తుది జాబితా మేరకు జిల్లాలో 9,20,229మంది పురుషులు, 9,45,916మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 25,687మంది మహిళలు ఎక్కవగా ఉన్నారు.

  • నియోజకవర్గాల వారీగా ఓటర్లు

బద్వేలు 87,966 86,818 1,74,784
రాజంపేట 96,825 1,01,381 1,98,206
కడప 81,099 84,451 1,65,550
రైల్వేకోడూరు 78,705 82,371 1,61,076
రాయచోటి 1,02,750 1,03,807 2,06,557
పులివెందుల 98,791 1,01,717 2,00,508
కమలాపురం 83,614 85,536 1,69,150
జమ్మలమడుగు 1,04,934 1,09,060 2,13,994
ప్రొద్దుటూరు 95,598 99,377 1,94,975
మైదుకూరు 89,947 91,398 1,81,345