ysrkadapa

వార్తలు

కస్తూర్బా విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణా తరగతులు

జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పదోతరగతిలో వివిధ ఫాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత కాలేకపోయిన విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్. ఎస్. ఎ. పీవో అంబవరం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలల్లో చదువుతూ పదవ తరగతిలో 275 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత కాలేక పోయారని, ప్రభుత్వ ఆదేశాలతో ఖాజీపేట, అట్లూరు, సంబేపల్లె కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఆయా పాఠ్యాంశాల నిపుణులచే ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.