విద్యాహబ్‌గా రాష్ట్రం

విద్యాహబ్‌గా రాష్ట్రం : ముఖ్యమంత్రి

వార్తలు
411 Views

రాష్ట్రాన్ని విద్యాహబ్‌గా తీర్చిదిద్ధుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జ్ఞానభూమిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నవనిర్మాణ దీక్షలో భాగంగా బుధవారం కడపలోని మునిసిపల్ స్టేడియంలో విద్య,  ఉపాధి అవకాశాలపై నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులకు పెద్ద సంపద పిల్లలేనని వారు చదువుకుంటే ప్రపంచాన్ని జయిస్తారని, పిల్లల విద్యే కుటుంబానికి సంపదని,  యువ సంపద మన దేశంలో అధికంగా ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో జన్మించి విద్యలో రాణించిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినందుకు అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఆడుతూ పాడుతూ ఒత్తిడికి గురికాకుండా చదువుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో వర్చువల్‌ తరగులు ఏర్పాటు చేయడం చరిత్రలో ఇది పెద్దదని తెలిపారు. విజ్ఞానానికి, మాతృభూమికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యార్థులేనన్నారు. విద్యాహబ్‌గా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అన్ని విధాలుగా తన ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని, హైదరాబాదును అభివృద్ధి చేస్తే  అప్పటి కేంద్రం విచక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చామని, ఆనాడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని కానీ రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.  అందుకే ఎవరూ చేయని విధంగా ధర్మపోరాటం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసి నిరసన తెలియజేస్తున్నానని, రాష్ట్రంలో తెలివైన ప్రజలు ఉన్నారని రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికోసం 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లో పెట్టమన్నారు. కేంద్రం చేసిన మోసానికి మనమందరం కలిసి పని చేద్దామన్నారు.  నాలుగు సంవత్సరాలు కష్టపడి సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పదవ తరగతిలో పదికి పది సాధించిన విద్యార్థులు జిల్లాలో 89మంది, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు నూరుమంది నీటి పరీక్ష రాస్తే 75 మంది పాస్ కావడం సంతోషకరమన్నారు. ప్రతి విద్యార్థి టెక్నాలజీని వినియోగించుకుని శాస్త్రవేత్తలు కావాలన్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. 2019 సంవత్సరం నాటికి నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించాలన్నారు. డిగ్రీ పాసైన విద్యార్థులకు రూ.1000 నిరుద్యోగ భృతి  ఇస్తామన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు.  కుప్పం కంటే జిల్లాలోని పులివెందులకు నీరు ఇచ్చిన  ఘనత తమకే దక్కిందన్నారు. ఆస్తులు లేకపోయినా తమ పిల్లలకు విద్యను అందించాలని జల్లా కలెక్టరు హరికిరణ్‌ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, తెదేపా నాయకులు పుత్తా నరసింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *