ఉపజలాశయం-1. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 107.260కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. రూ.22.46కోట్లు చేశారు. అందులో ఎ బండ్‌ నిర్మాణం కోసం రూ.16.73కోట్లు, బి.బండ్‌ నిర్మాణానికి రూ.5.73కోట్లు ఖర్చు పెట్టారు. ఉపజలాశయం-1 నుంచి చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు వీలుగా దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట మండలాల మీదుగా 45.05కి.మీ నిర్మించిన చెన్నముక్కపల్లె కాల్వ ద్వారా 20316ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.

కనిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) 208 మీటర్లు
గరిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) 223 మీటర్లు
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 2.133 టీఎంసీలు
డెడ్‌స్టోరేజ్‌ 0.289 టీఎంసీలు

Subsidiary Reservoir-1

ఉపజలాశయం-2. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 113.344కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. దీనికోసం రూ. 34.38కోట్లు ఖర్చు చేశారు. ఉపజలాశయం-2 నుంచి వనిపెంట, జీవీసత్రం మీదుగా 32కి.మీ నిర్మించిన కాల్వ ద్వారా 10445ఎకరాల ఆయకట్టు సాగునీరు ఇవ్వాలి.

కనిష్ఠ నీటిమట్టం 204.000 మీటర్లు
గరిష్ఠ నీటిమట్టం 222.780 మీటర్లు
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 2.444 టీఎంసీలు
డెడ్‌స్టోరేజి 0.18 టీఎంసీలు

 Subsidiary Reservoir-2