మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అమ్మవారి శాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ మాజీ అధ్యక్షుడు నేతి రెడ్డయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీలోని సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి హాజరయ్యారు. ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.