త త్త్వవేత్తలు ఆదర్శవంతంగా ఉండాలి

382 Viewsజిహ్వరుచులకొరకు  జీవితలక్ష్యమే విడుచువాడు తత్త్వవేత్తకాడు నాల్కగట్టువాడు నారాయణుండౌను కాళికాంబ!హంస!కాళికాంబ….. ఇది తత్త్వవేత్తలని ప్రచారం చేసుకునే తిండిపోతులను గురించి బ్రహ్మంగారు చెప్పినపద్యం. మనషులు రెండురకాలుగా ఉంటారు. బతకడానికి అవసరమైనంత మేర ఆహారం తీసుకునేవాళ్ళు ఒకరకం కాగా, తినడానికే పుట్టినట్లు పొట్ట పగిలేట్టు మెక్కేవాళ్ళు ఇంకోరకం. తత్త్వవేత్త  బతకడానికి తిండితినేవాడై ఉండాలి. కానీ తత్త్వవేత్తల వేషం వేసుకొని  సామాన్య మానవులు తిన్నట్లుగా తినేవాళ్ళను బ్రహ్మంగారు గుర్తించి వాళ్ళను విమర్శిస్తూ ఈపద్యం రాశారు. త త్త్వవేత్తలు సంఘానికి అనేకరకాలుగా ఆదర్శవంతంగా […]

Continue Reading

కష్టపడి బతికేవాళ్ళే గొప్పవాళ్ళు

417 Viewsఅష్టమదములున్న అధమాధముండగు కష్టపడెడువాడు ఘనుడు జగతి పరులకూటికాసపడును దౌర్భాగ్యుండు కాంబ!హంస!కాళికాంబ…… అష్టమదములు అంటే అన్నమదం, అర్థమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం , ఉద్యోగమదం, యౌవనమదం. ఈ ఎనిమిది మదాలు తలకెక్కినవాడు అధములలో అధముడు. కష్టపడేవాడే గొప్పవాడు. ఇతరులకూటికి ఆశపడేవాడు దౌర్భాగ్యుడు . బ్రహ్మంగారు తనకాలంనాటి అసమ సమాజాన్ని దగ్గర నుంచి పరిశీలించి చేసిన విశ్లేషణ ఈపద్యం.   ఉక్కళంగా అన్ని సౌకర్యాలూ సమకూరినవారు, ప్రతిదానికీ కష్టపడుతున్నవాళ్ళను బ్రహ్మంగారు గమనించారు. అన్నీ సమకూరిన వారికి కళ్ళు నెత్తికెక్కి […]

Continue Reading

దురాశను వదులుకుంటేనే దు:ఖానికి తెర

1,189 Viewsమానసమ్మునందు జ్ఞానవైరాగ్యాలు కుదురుపడగ ఆశ బెదరిపోవు ఆశపోవనంతమొందును దుఃఖమ్ము కాళికాంబ!హంస!కాళికాంబ…….. మనస్సులో జ్ఞానం వైరాగ్యం అనే రెండు భావాలు బాగా కుదురుకున్నాయంటే ఆశ బెదిరిపోయి వెళ్ళిపోతుంది. ఆ ఆశ మనలోంచి వెళ్ళిపోయిందంటే దుఃఖం నశిస్తుంది. దురాశాపరులకు బ్రహ్మంగారు చేసిన బోధ ఇది. ఆయన యోగి. కనుకనే ఇలా చెప్పగలిగారు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని నడిపిస్తుంది.  సమాజంలో దుఃఖం ఉంది. అందుకు కోర్కెలు ఉండడమే కారణమని బౌద్ధం చెప్పినట్లు చిన్నప్పుడు చదువుకున్నాం. ఏమైనా మానవజాతి ఆశతోనే […]

Continue Reading

మదం మంచికాదు

402 Viewsచదువు ధనము తపము సౌందర్యము గుణమ్ము కులము గోత్రములను గలుగు మదము మానువారె దురభిమానవర్జితులిల కాళికాంబ!హంస!కాళికాంబ అనేక కారణాలచేత కొందరు చదువుకోగలుగుతారు, కొందరు చదువుకోలేకపోతారు. మొన్నటిదాకా మనదేశంలో విద్య సార్వత్రికం కాదు. కొందరు ధనవంతులు కాగలుగుతారు,అనేకులు పేదలుగా మిగిలిపోతారు. కొందరికి తపస్సు చేసుకునే విశ్రాంతి ఉంటుంది. అనేకులకు తీరిక ఉండదు. పైగా అందరికీ తపస్సు హక్కు కాదు. కొందరు అందంగా పుడతారు, మరి కొందరు అలా పుట్టలేకపోతారు. కొందరు గుణవంతులౌతారు మరికొందరు గుణహీనులౌతారు. కొందరు పైకులాలలో […]

Continue Reading