భక్తి లేకుండా జ్ఞాన ఫలం లభించదు

396 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి. “ఏదీ తనంతతానై నీదరికి రాదు, […]

Continue Reading

కొంపలు కూల్చే కులం

1,050 Views“కులమనేటి తెగులు కొంపలు గూల్చును చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ!హంస!కాళికాంబ!” కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ చంపగలిగినవాడు గురువైన విప్రుడు. వేలయేళ్ళుగా భారతదేశాన్ని శాసిస్తున్న కులవ్యవస్థ సృష్టించిన విధ్వంసాన్ని అందులోని నిరంకుశత్వాన్ని కళ్ళారా చూశారు బ్రహ్మంగారు. అలాగే చలం మితంమాలిన స్వార్థం అనేరోగంతో మనుషులు సతమతం కావడం అది సృష్టించిన విధ్వంసాన్ని కూడా ఆయన గమనిం చారు. ఈరెండు […]

Continue Reading

నిర్భాగ్యులు

395 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో బ్రహ్మంగారు ఈపద్యం ద్వారా ముందు వరసలో నిలబడ్డారు. మనిషి తనజీవితం సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవడం అందుకు అవసరమైన సంపదను సమకూర్చుకోవడం తప్పుకాదు. ఇది భౌతిక జీవితానికి సంబంధించిన  కోరిక. ఇది నెరవేరాలంటే భౌతికంగానే ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయాలి. నియమబద్ధమైన జీవితం […]

Continue Reading

మనుషులున్న సమాజ నిర్మాణం

1,042 Viewsస్వాములనగ ఐహికాముష్మికఫలాల వాంఛచేయనట్టివారు ధరణి లోకవాంఛలకును లోబడ గురుడౌనె కాళికాంబ!హంస!కాళికాంబ. మనదేశంలో ప్రాచీనకాలం నుంచి స్వాములుగా చెలామణి అయ్యేవాళ్ళకు చాలా గౌరవముంది. వాళ్ళు చాలా శక్తులు సిద్ధులు గలవాళ్ళని జనం వాళ్ళకు ఒదిగి ఉండాలని వాళ్ళను ఎదిరిస్తే కష్టాలు వస్తాయని జనం భావిస్తారు. ప్రచారం కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళను గురువులుగా జనం పూజిస్తారు. వాళ్ళకు విధేయత ప్రకటిస్తారు. అయితే వాళ్ళలో చాలామంది అంత విధేయతకు గౌరవానికి అర్హులుగా కనిపించరు. అందుకు కారణం వాళ్ళే. వాళ్ళు […]

Continue Reading