భక్తి లేకుండా జ్ఞాన ఫలం లభించదు

385 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి. “ఏదీ తనంతతానై నీదరికి రాదు, […]

Continue Reading

కొంపలు కూల్చే కులం

1,028 Views“కులమనేటి తెగులు కొంపలు గూల్చును చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ!హంస!కాళికాంబ!” కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ చంపగలిగినవాడు గురువైన విప్రుడు. వేలయేళ్ళుగా భారతదేశాన్ని శాసిస్తున్న కులవ్యవస్థ సృష్టించిన విధ్వంసాన్ని అందులోని నిరంకుశత్వాన్ని కళ్ళారా చూశారు బ్రహ్మంగారు. అలాగే చలం మితంమాలిన స్వార్థం అనేరోగంతో మనుషులు సతమతం కావడం అది సృష్టించిన విధ్వంసాన్ని కూడా ఆయన గమనిం చారు. ఈరెండు […]

Continue Reading

నిర్భాగ్యులు

386 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో బ్రహ్మంగారు ఈపద్యం ద్వారా ముందు వరసలో నిలబడ్డారు. మనిషి తనజీవితం సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవడం అందుకు అవసరమైన సంపదను సమకూర్చుకోవడం తప్పుకాదు. ఇది భౌతిక జీవితానికి సంబంధించిన  కోరిక. ఇది నెరవేరాలంటే భౌతికంగానే ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయాలి. నియమబద్ధమైన జీవితం […]

Continue Reading

మ్రొక్కులతో బతుకు చక్కబడదు

392 Viewsసాటిమానవునకు సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబ!హంస!కాళికాంబ. బాధలలో పేదరికంలో ఉన్న సాటి మనిషికి  సహాయం  చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుడులు కట్టడం వల్ల  వాటికి మొక్కడం వల్ల మానవ జీవితం చక్కపడదు. మానవుని భౌతిక సమస్యలకు మతం దగ్గర పరిష్కారం లేదు. మానవ సమస్యలకు భౌతిక సమాజంలోనే పరిష్కారాలుంటాయి. వాటిని గుర్తించాలి. అంతేకానీ మనుషుల బాధలను పరిష్కరించేపనిని వదిలేసి, గుడులు కట్టించి రాళ్ళతో విగ్రహాలు చేసి వాటిని గుడులలో […]

Continue Reading