భక్తి లేకుండా జ్ఞాన ఫలం లభించదు

254 Views“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ!” నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి. “ఏదీ తనంతతానై నీదరికి రాదు, […]

Continue Reading

కొంపలు కూల్చే కులం

689 Views“కులమనేటి తెగులు కొంపలు గూల్చును చలమనేటి తెగులు చావుతెచ్చు? కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబ!హంస!కాళికాంబ!” కులం అనే రోగం కొంపలు కూలుస్తుంది. నిలకడలేని తనం అనేరోగం చావును తెస్తుంది. ఈరెంటినీ చంపగలిగినవాడు గురువైన విప్రుడు. వేలయేళ్ళుగా భారతదేశాన్ని శాసిస్తున్న కులవ్యవస్థ సృష్టించిన విధ్వంసాన్ని అందులోని నిరంకుశత్వాన్ని కళ్ళారా చూశారు బ్రహ్మంగారు. అలాగే చలం మితంమాలిన స్వార్థం అనేరోగంతో మనుషులు సతమతం కావడం అది సృష్టించిన విధ్వంసాన్ని కూడా ఆయన గమనిం చారు. ఈరెండు […]

Continue Reading

శివయే సృష్టికి మూలం

245 Viewsశివుడు శక్తిగూడి సృష్టికార్యమొనర్చు శివను వీడ సృష్టి చేయలేడు శివునికంటె శివయె సృష్టికి మూలమ్ము కాళికాంబ! హంస!కాళికాంబ! శివుడు శక్తితో కలసి సృష్టికార్యం నిర్వహిస్తాడు. శివను వదిలి ఆయన ఆపని చేయలేడు. అందువల్ల శివుని కన్నా శివయే సృష్టికి మూలం. శివుడు అంటేఅందరికీ తెలుసు. శివ అన్నా శక్తి అన్నా పార్వతి. శివపార్వతులు పౌరాణిక దంపతులు. ఈజంటను  ఉపయోగించుకొని బ్రహ్మంగారు  సమాజంలో స్త్రీప్రాధాన్యాన్ని చెప్పారు. పురాణాలు ప్రకృతి పురుషుల సమాగమం వల్ల సృష్టి విస్తరించిందని చెబుతాయి. […]

Continue Reading

నిర్భాగ్యులు

266 Views నిగ్రహమ్ములేని నిర్భాగ్యులెల్లరు విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను బొందకాంక్షింతురు కాళికాంబ!హంస! కాళికాంబ! ఆలోచించే ఓపికలేని నిర్భాగ్యులు మనిషి చేసిన విగ్రహాలకు విందులు చేసి  దాని ద్వారా భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. విగ్రహారాధన నిరసనోద్యమంలో బ్రహ్మంగారు ఈపద్యం ద్వారా ముందు వరసలో నిలబడ్డారు. మనిషి తనజీవితం సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవడం అందుకు అవసరమైన సంపదను సమకూర్చుకోవడం తప్పుకాదు. ఇది భౌతిక జీవితానికి సంబంధించిన  కోరిక. ఇది నెరవేరాలంటే భౌతికంగానే ప్రయత్నం చేయాలి. కష్టపడి పనిచేయాలి. నియమబద్ధమైన జీవితం […]

Continue Reading