Friday, March 29, 2024

త‌వ్వా ఓబుల‌రెడ్డి

ఖాజీపేట మండ‌లం బ‌క్కాయ‌ప‌ల్లెలో జ‌న్మించిన త‌వ్వా ఓబుల‌రెడ్డి వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. 1967లో జ‌న్మించిన ఓబుల‌రెడ్డి సాహిత్యం, జ‌ర్నలిజం ప్రవృత్తి. క‌డ‌ప‌.ఇన్పో అంత‌ర్జాలానికి గౌర‌వ అధ్యక్షుడిగా ఉన్నారు.ఎన్నో క‌థ‌లు, క‌విత‌లు రాశారు. తొలిక‌థ స్మృతిప‌థం 1999లో ఆదివారం వార్త దిన‌పత్రిక‌లో ప్రచురిత‌మైంది. తెలుగుభాషోద్యమ శాఖ రాయ‌ల‌సీమ ప్రాంత కార్యద‌ర్శిగా తెలుగుభాషాభివృద్ధి కోసం దోహ‌ద‌ప‌డుతున్నారు. త‌న‌వంతు సేవ‌లు అందిస్తున్నారు. ఓబుల‌రెడ్డి గారి ర‌చ‌న‌లు, స‌మీక్షలు వివిధ ప‌త్రిక‌ల్లోనూ ప్రచురిత‌మ‌య్యాయి. రేడియోల్లోనూ ప్రసారం చేశారు. గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని చిత్రీక‌రించ‌డం వీరికి ఇష్టం.

* క‌డుపాత్రం, న‌వ వ‌సంతం, ఉచ్చు, తొలిగుడిసె, స్మృతిప‌థం, క‌థ‌లు వివిధ సంకల‌నాల్లో ప్రచురిత‌మ‌య్యాయి.
* 1956 నుంచి 2006వ‌ర‌కు ర‌చించిన వాటిలో ఉత్తమ క‌థ‌ల‌ను సేక‌రించి క‌డ‌ప‌క‌థ సంక‌ల‌నాన్ని వెలువ‌రించారు.
* రాయ‌ల‌సీమ వైభ‌వం పేరుతో రాయ‌ల‌సీమ సామాజిక‌, సాంస్కృతిక, సాహిత్య అంశాల‌తో కూడిన గ్రంధానికి సంపాద‌క‌త్వం వ‌హించారు.
చ‌రిత్రల‌పై ప‌రిశోధ‌న‌
* ఖాజీపేట మండ‌లం పుల్లూరులో బౌద్ద ఆరామానికి సంబంధించి ప‌రిశోధ‌న జ‌రిపి పుల్లూరు చెరువు, వెంక‌ట‌రామాపురం ప‌రిస‌రాల్లోని బుద్దుని పాద‌ముద్రిక‌లు క‌నుగొని పురావ‌స్తు శాఖ మ్యూజియానికి త‌ర‌లించేలా కృషి చేశారు.
* ప్రముఖ క‌వి చౌడ‌ప్ప ఖాజీపేట మండ‌లం పుల్లూరు వాసేన‌ని ఆధారాల‌తో నిరూపించారు. ఆన‌వాళ్ల వివ‌రాల‌ను ప్రక‌టించారు.
* ఖాజీపేట మండ‌లం ముత్తలూరుపాడులోని శివాల‌యం వ‌ద్ద బుక్కరాయ‌ల‌కాలం నాటి ఆరుదైన శాస‌నాన్ని పురావ‌స్తుశాఖ దృష్టికి తెచ్చారు.
* గండికోట చ‌రిత్ర విశేషాల‌పై గండికోట చ‌రిత్ర పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.
* మైదుకూరు మండ‌లం హొన్నూర‌మ్మ, పేర్నిపాడు, వ‌నిపెంట‌, నంద్యాలంపేట‌, ఏక‌ర్లపాలెం ప్రాంతాల చ‌రిత్రపై వ్యాసాలు రాశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular