కమలాపురం మండలం కోగటంలో 17వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాన్ని మైసూర్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ప్రొద్దుటూరులోని రామేశ్వరానికి చెందిన కొండుబట్టు రామకృష్ణబట్టు అనే వ్యక్తి కోదండరామ స్వామి దేవాలయం, వీరాంజనేయ స్వామి దేవాలయం, కోనేరు, వనం తటాకాన్ని నిర్మించినట్లు శాసనంలో ఉన్నట్లుగా మైసూర్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.