teluguganga base map1977 అక్టోబ‌రు 28వ తేదీన కృష్ణాన‌ది ప‌రివాహ‌క రాష్రాలైన మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న అంత‌రాష్ట్ర ఒప్పందం మేర‌కు బ‌చావత్ ట్రిబ్యున‌ల్‌చే కేటాయించ‌బ‌డిన 75శాతం న‌మ్మకంగా ల‌భించే జ‌లాశ‌యాల నుంచి ఒక్కో రాష్ట్రం 5టీఎంసీల నుంచి నీటిని త‌మిళ‌నాడు ప్రజ‌ల  తాగునీటి అవ‌స‌రాల కోసం స‌ర‌ఫ‌రా చేసేందుకు ఒప్పందం జ‌రిగింది. క‌ర‌వు కాట‌కాల‌తో అల్లాడుతున్న క‌ర్నూలు,క‌డ‌ప‌, చిత్తూరుతోపాటు నెల్లూరు జిల్లాలోని 6.05లక్షల ఎక‌రాల‌కు సాగునీరు అందించే విధంగా 1983 ఏప్రిల్ 18వ‌తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స‌మ‌క్షంలో ఆంధ్రప్రదేశ్, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, ఎంజీరామ‌చంద్రన్ కుదుర్చుకున్న ఒప్పంద‌మే తెలుగుగంగ‌. 29టీఎంసీల నిక‌ర కృష్ణాజ‌లాలు, 30టీఎంసీల పెన్నాన‌ది నీటితో సాగునీరు అందిస్తారు. శ్రీ‌శైలం జ‌లాశ‌య విస్తరణ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వ‌ద్ద ప్రధాన రెగ్యులేట‌ర్ నిర్మాణం జ‌రిగింది. అక్కడి ప్రధాన కుడికాల్వ 16.8 కి.మీ. ప్రవాహించి బ‌న‌క‌చెర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ వ‌ద్దకు నీరు చేరుతుంది. బ‌న‌క‌చెర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ఎడ‌మ వైపున నిర్మించిన లింక్‌కాల్వ ద్వారా 11,150 క్యూసెక్కుల నీటి ప్ర‌వాహంతో 7.74 కి.మీ. ప‌య‌నించి గాలేరున‌గ‌రికి అనుసంధానంగా నిర్మించిన వెలుగోడు జ‌లాశ‌యంలోకి చేరుతుంది.

క‌ర్నూలు జిల్లాలోని వెలుగోడు వ‌ద్ద 16.95టీఎంసీల సామ‌ర్థ్యంతో వెలుగోడు జ‌లాశ‌యం నిర్మించారు. వెలుగోడు జ‌లాశ‌యం ప్రధాన రెగ్యులేట‌ర్ ద్వారా తెలుగుగంగ ప్రధానకాల్వలోకి నీరు ప్రవహిస్తుంది. క‌ర్నూలు జిల్లాలోని 1.14లక్షల ఎక‌రాల‌కు సాగునీటితోపాటు నంద్యాల పట్టణ ప్రజల దాహార్తి తీర్చేలాగా జ‌లాశ‌య నిర్మాణం జ‌రిగింది.

వెలుగోడు నుంచి తెలుగుగంగ ప్రధానకాల్వలోకి వ‌ద‌లిన నీరు 98.260కి.మీ. ప్రవహించి క‌డ‌ప జిల్లాలోకి ప్రవేశిస్తాయి. 108 కి.మీ. వ‌ద్ద 2.133టీఎంసీల సామ‌ర్థ్యంతో నిర్మించిన ఉప‌జ‌లాశ‌యం-1లోకి చేరుతుంది. ఉప‌జ‌లాశ‌యానికి నిర్మించిన ప్రధాన రెగ్యులేట‌ర్ ద్వారా 14.50మెగావాట్ల విద్యుదుత్పత్తి చేప‌ట్టే విధంగా రూప‌క‌ల్పన చేశారు. ఉప‌జ‌లాశ‌యం-1కి నిర్మించిన ప్రధానకాల్వ ద్వారా ఉప‌జ‌లాశ‌యం-2కు అక్కడి నుంచి బ్రహ్మంసాగర్ జ‌లాశ‌యం చేరుతుంది. మ‌రొక కాల్వ చెన్నముక్కపల్లె కాల్వ. ఉప‌జ‌లాశ‌యం-1 నుంచి 45.850కి.మీ. ప్రవ‌హించి పెన్నాన‌దిలో క‌లుస్తుంది. ఈకాల్వ ద్వారా సాగునీటితోపాటు చెన్నైవాసుల‌కు తాగునీరు అందిస్తారు. అటు బ్రహ్మంసాగర్‌ ఇటు చైన్నైవాసుల‌కు తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ఉప‌జ‌లాశ‌యం-1 క‌డ‌ప జిల్లాలో తెలుగుగంగ‌లో ప్రధాన కేంద్రంగా మారింది.

బ్రహ్మంసాగ‌ర్ నుంచి ఎడ‌మ, కుడి కాల్వ ద్వారా ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందిస్తారు. బ్రహ్మంసాగర్ జ‌లాశ‌యం కుడి వైపున ఉన్న తూము ద్వారా 442 క్యూసెక్కులు, ఎడ‌మ‌కాల్వ ద్వారా 1753 క్యూసెక్కులు ప్రవహించేలా రూపకల్పన చేశారు. కుడికాల్వ ద్వారా 30వేల ఎక‌రాలు, ఎడమకాల్వ ద్వారా 1.20లక్షల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తారు.

నీటి కేటాయింపులు : బ‌చావ‌త్ అవార్డు ప్రకారం కేసీకాల్వకు 39.90టీఎంసీలు నీరు కేటాయించారు. 10టీఎంసీలు తుంగ‌భ‌ద్ర నుంచి కేటాయించ‌గా మిగిలిన 29.90టీఎంసీలు తుంగ‌భ‌ద్ర ప‌రివాహ‌క ప్రాంతం నుంచి వాడుకునేలా చేశారు.