మైదుకూరు సమీపంలోని సరస్వతీపేట వద్ద గురువారం ప్రైవేట్‌ బస్సు, వేరుసెనగ బస్తాలతో వెళ్తున్న ట్రాక్టరును ఢీకొంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దువ్వూరు మండలం పెద్దభాకరాపుం గ్రామానికి చెందిన రైతులు శివయ్య, ఫకృద్ధీన్‌లు వేరుసెనగ దిగుబడిని విక్రయించేందుకు కడపకు వెళ్తూ ఉండగా వెనుక హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు ఢీకొంది.  ట్రాక్టరులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టరు ట్రాలీ ఒరిగి పోవడంతో వేరుసెనగ బస్తాలు కిందపడ్డాయి.