ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి భవనాన్ని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా  సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం రూ.4.06 కోట్లతో యాత్రికల వసతిగృహాన్ని నిర్మించినట్లు చెప్పారు. మొదటి అంతస్తులో 600 భోజనం చేసేలా వసతి,  వంద మంది విశ్రాంతి తీసుకునేలా పెద్ద గదులు నిర్మించినట్లు తెలిపారు. జేఈవో  పోలా భాస్కర్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కల్యాణోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నిర్వహిస్తోందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ఒంటిమిట్టకు తలమానికమని ఈ ఆలయాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హరికిరణ్‌ తెలిపారు. రాబోయే  రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  తిరుమలలో అన్న ప్రసాదం అందిస్తున్నట్లుగా ఒంటిమిట్టలో కూడా  రెండువేల మందికి అన్నప్రసాదం కల్పించాలని ప్రభుత్వ విప్‌ మల్లికార్జునరెడ్డి కోరారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు.  హైదరాబాదులోని ట్యాంకుబండ్ లాగా ఒంటిమిట్ట చెరువును అభివృద్ధి చేయాలన్నారు.