వైఎస్సార్‌కు ఘన నివాళి

వార్తలు
498 Views
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 8.50 గంటలకు డాక్టర్ వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రితో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, ముఖ్యమంత్రి మామగారు డా.ఇ సి.గంగిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులు, ఇతరులు అందరూ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు.

ముఖ్యమంత్రితో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి అంజద్ భాష, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సి. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, తితిదే చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంఎల్సీలు వెన్నుపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, ఎస్పి కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్లు ఎం.గౌతమి, సి.ఎం. సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్లు పృథ్వి తేజ్, కేతన్ గార్గ్, ట్రైనీ కలెక్టర్ వికాస్ మర్మాట్, ఓఎస్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *